బెంగాల్‌ అసెంబ్లీలో రచ్చ రచ్చ.. కొట్టుకున్న ఎమ్మెల్యేలు, వీడియో వైరల్‌

28 Mar, 2022 14:35 IST|Sakshi

లక్నో: పశ్చిమబెంగాల్‌ శాసనసభలో అధికార పార్టీ టీఎంసీ, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా నేతల మధ్య తోపులాటలు జరిగాయి. రాంపూర్‌హాట్‌, బీర్భూమ్‌ హింసాత్మక ఘటనలపై చర్చలు జరపాలంటూ బీజేపీ ఎమ్మెల్యే, ప్రతిపక్షనేత సువేందు అధికారి డిమాండ్‌ చేశారు. స్పీకర్‌ పోడియం వద్ద నిరసనలు తెలియజేశారు. ఈ నేపథ్యంలో టీఎంసీ, బీజేపీ నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఎమ్మెల్యేలు ఒకరినొకరు కొట్టుకున్నారు.

ఈ గొడవలో బీజేపీ ఎమ్మెల్యే మనోజ్‌ తిగ్గ బట్టలు చిరిగిపో.. టీఎంసీ ఎమ్మెల్యే అసిత్‌ మజుందర్‌ ముక్కుకు గాయమైంది. మరోవైపు శాసనసభలో జరిగిన గందరగోళం నేపథ్యంలో శాసనసభ ప్రతిపక్షనేత సువేందుతో సహా అయిదుగురు బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్‌ సస్పెండ్‌ చేశారు. స్పీకర్‌ చర్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సువిందు సహా బీజేపీ సభ్యులందరూ  సభ భయట నిరసనకు దిగారు. బీజేపీ నేతలపై జరిగిన దాడి నేపథ్యంలో స్పీకర్‌ చర్యలు తీసుకోకుంటే న్యాయపరమైన పోరాటం చేస్తామని తెలిపారు.
చదవండి: కశ్మీర్‌ ఫైల్స్‌.. కేజ్రీవాల్‌కు స్ట్రాంగ్ కౌంటర్‌

కాగా పశ్చిమబెంగాల్‌లోని బీర్‌భూమ్‌ జిల్లాలో పది ఇళ్లకు నిప్పంటించిన ఘటనలో ఎనిమిది మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. టీఎంసీ నాయకుడు తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకుడు బాద్‌ షేక్‌ హత్యకి ప్రతీకారంగా మార్చి 21న ఈ ఘటన చోటుచేసుకుంది. బీర్‌భూమ్‌ సజీవ దహనాలపై విచారణ బాధ్యతను కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ స్వీకరించింది. ఈ దారుణ ఘటనపై పలు కేసులు నమోదు చేసింది. 

మరిన్ని వార్తలు