‘వంచన, వెన్నుపోటుకు పుట్టిన బిడ్డే ఉన్మాది చంద్రబాబు’

27 May, 2022 17:07 IST|Sakshi

 వైఎస్సార్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజయసాయిరెడ్డి

సాక్షి, తాడేపల్లి: వంచన అనే తండ్రికి, వెన్నుపోటు అనే తల్లికి పుట్టిన ఉన్మాది చంద్రబాబు అని వైఎస్సార్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజయసాయిరెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన ఉన్మాది చంద్రబాబు అని ధ్వజమెత్తారు.
చదవండి: మామను చంపిన ‘బాబు’ ఏ మొహం పెట్టుకుని మహానాడు చేస్తున్నాడు

బీసీ, ఎస్సీ, ఎస్టీలపై చంద్రబాబు ఎందుకు పగ సాధిస్తున్నారు. ‘‘కిక్‌ బాబు-సేవ్‌ ఏపీ’’ నినాదంతో వైఎస్సార్‌సీపీ ముందుకు వెళ్తోంది. ఎంతో ఉన్నతాశయంతో ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించారు. నారా అంటే నాసి రకం రాజకీయ నాయకుడు. చంద్రబాబును తరిమికొడితేనే ఏపీకి మంచి రోజులు. 14 సంవత్సరాల్లో చంద్రబాబు ఏం సాధించారు? ఒక్క ప్రాజెక్టునైనా ఆయన పూర్తి చేశారా? అని’’ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలు సంతోషంగా ఉన్నారు. రాష్ట్రం సస్యశ్యామలంగా అభివృద్ధి చెందుతోందని విజయసాయిరెడ్డి అన్నారు.
 

మరిన్ని వార్తలు