చంద్రబాబు ప్రయోజనాలే ఎల్లో మీడియా ధ్యేయం

21 Sep, 2022 06:20 IST|Sakshi

వైఎస్సార్‌సీ పార్లమెంటరీపార్టీ నేత విజయసాయిరెడ్డి విమర్శ

సాక్షి, అమరావతి: ప్రజల పక్షాన ఉండాల్సిన ప్రసార మాధ్యమాలు ప్రతిపక్ష నేత ప్రయోజనమే ధ్యేయం అన్నట్లుగా వ్యవహరించటం బాధ కలిగిస్తోందని వైఎస్సార్‌సీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి చెప్పారు. చంద్రబాబు అసమర్ధతను కప్పిపుచ్చేందుకు ఆయన అనుకూల మీడియా అబద్ధాలు, అర్ధసత్యాలు ప్రచారం చేసే పనిని నెత్తినఎత్తుకుని తామే ప్రతిపక్షంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. నిరంతర జాగురూకతతో ఉండే రాష్ట్ర ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని తెలిపారు.

ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైనా, అమరావతి నిర్మాణంపైనా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యంపైనా సీఎం వైఎస్‌ జగన్‌  సంపూర్ణ గణాంకాలతో వివరణలు ఇచ్చారన్నారు. ఆ వెంటనే టీడీపీ అనుకూల పత్రికలు రంగంలోకి దిగి సీఎం జగన్‌ మాటలు అబద్ధాలన్నట్లు అడ్డగోలు వాదనలు, అంకెల గారడీలతో ప్రజలను నమ్మించడానికి కథనాలు వండి వార్చాయని తెలిపారు.   

మరిన్ని వార్తలు