'ఆ గేదె బాబుకు వందల కోట్ల రూపాయల పాలిచ్చింది'

26 Oct, 2020 06:39 IST|Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు తన ట్విటర్‌ ఖాతాలో.. '28 ఏళ్ల క్రితం ఈనిన ఒక గేదె, చంద్రబాబుకు వందల కోట్ల రూపాయల పాలిచ్చింది. 2014లో ఆ గేదెకు గడ్డి పెట్టేందుకు కొన్న బినామీ భూముల్లో వేల కోట్లుగా నోట్ల కట్టలు పండకపోతే మరి చంద్రబాబుకు కోపం రాదా? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. (బాబేమో పొర్లిపొర్లి ఏడుస్తున్నాడు..!)

మరో ట్వీట్‌లో.. 'అక్రమ కట్టడాలను చట్ట ప్రకారం కూలిస్తే పచ్చ బ్యాచ్ మొత్తం నెత్తీ నోరు కొట్టుకుంటోంది. ఆంధ్రా యూనివర్సిటీని దయ్యాల కొంపని సదరు ఆక్రమదారుడు వెటకారం చేసినప్పుడు పేదలు చదువుకునే ఏయూని భ్రష్టు పట్టించినప్పుడు ఒక్కరూ మాట్లాడలేదు. పేదల ప్రయోజనాలకన్నా పచ్చనాయకుని ప్రయోజనాలే ఎక్కువైపోయాయా?' అంటూ విమర్శలు గుప్పించారు. (ఆ లాజిక్‌ను చంద్రబాబు ఎప్పుడో గాలికొదిలారు!)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు