‘సోనియా, చంద్రబాబు ద్రోహాన్ని​ ఎవరూ క్షమించరు’

29 Jan, 2024 17:42 IST|Sakshi

పల్నాడు: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే రాష్ట్రంలో సామాజిక న్యాయం సాధ్యమైందని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి అన్నారు. ఆయన సోమవారం చిలకలూరిపేటలో మీడియాతో మాట్లాడారు. గత పాలనలో చంద్రబాబు వెనుకబడిన వర్గాలను పట్టించుకోలేదని మండిపడ్డారు. చంద్రబాబు దళితులను కేవలం ఓటు బ్యాంకుగానే చూశారని తెలిపారు.

ఇక.. కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ ఏపీకి చేసిన ద్రోహానికి ఆమెను ఎవరు క్షమించరని అన్నారు. రాష్ట్రానికి చేసిన ద్రోహాన్ని తరతరాలు గుర్తుపెట్టుకుంటారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రపుటల్లో కలిసిపోయిందని ఎద్దేవా చేశారు. సామాజిక సాధికార యాత్ర దేశంలోనే ఎవరూ చేయని ఓ అద్భుతమైన కార్యక్రమమని కొనియాడారు. వచ్చే ఎన్నికలు ధనికులకు.. పేదవారికి మధ్య జరిగే ఓ రెఫరండమని అన్నారు.

ఈ యుద్ధంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు పేదవారి పక్కన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిలబడి వారిని గెలిపిస్తారని తెలిపారు. ప్రజల మధ్య సామాజిక ఆర్థిక అసమానతలు తొలగిపోవాలంటే సీఎం జగన్‌ మరోసారి ముఖ్యమంత్రి కావాలన్నారు. వచ్చే అసెంబ్లీ ఎ​న్నికల్లో చిలకలూరి పేట నుంచి మల్లెల రాజేశ్‌ నాయుడు పోటీ చేస్తారని తెలిపారు. ఇక్కడ రాజేష్ నాయుడును గెలిపించాలని ఆయన కోరారు.

చదవండి:  వైఎస్సార్‌సీపీ రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌లపై స్పీకర్‌ విచారణ


 

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega