తెలంగాణ బీజేపీలో ముసలం.. ఈటలకు విజయశాంతి కౌంటర్‌?

30 Jan, 2023 10:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవల అన్ని రాజకీయ పార్టీల్లో సీఎం కేసీఆర్‌కు కోవర్టులు ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో, తెలంగాణ బీజేపీ నేతలు ఈటల వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీలో ఇద్దరు జాతీయ కార్యవర్గ సభ్యుల మధ్య మాటల యుద్ధం నడుస్తున్నట్టు సమాచారం. 

తాజాగా ఈటల రాజేందర్‌ వ్యాఖ్యలపై బీజేపీ నేత విజయశాంతి కౌంటర్‌ అటాక్‌ చేశారు. కోవర్టులను పేర్లతో సహా బయటపెట్టండి అంటూ కామెంట్స్‌ చేశారు. నిజంగా కోవర్టులు ఉంటే కేంద్రం కూడా వారిపై చర్యలు తీసుకుంటుంది. వారి గురించి నిజాలు బయటపెట్టండి. దీంతో, పార్టీకి మీరు మేలు చేసిన వారు అవుతారు అని ఈటలను ఉద్దేశించి కామెంట్స్‌ చేశారు. ఊరికే కోవర్టులు ఉన్నారని చెప్పి తప్పించుకోవడం కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక దొంగతనం జరిగినప్పుడు దొంగను పట్టుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది. వారిని పోలీసులను అప్పగించాలి కదా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో పరోక్షంగా ఈటలకు విజయశాంతి కౌంటర్‌ ఇచ్చినట్టు అ‍య్యింది. 

మరోవైపు.. ఈటల రాజేందర్‌ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ క్లారిటీ ఇచ్చారు. బండి సంజయ్‌ మాట్లాడుతూ.. బీజేపీలో కోవర్టులు ఉండరు. బీజేపీ సిద్దాంతం కలిగిన పార్టీ అంటూ కామెంట్స్‌ చేశారు. 

మరిన్ని వార్తలు