‘చంద్రబాబు అండ్‌ కో కుల రాజకీయాలపై దృష్టిపెట్టింది’

29 May, 2021 22:34 IST|Sakshi

సాక్షి, అమరావతి:  వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా చంద్రబాబుపై శనివారం వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో ప్రజలు, ప్రభుత్వం కరోనాతో పోరాడుతుంటే చంద్రబాబు అండ్‌ కో కుల రాజకీయాలపై దృష్టిపెట్టిందని ధ్వజమెత్తారు. ప్రజలకు అండగా నిలబడాల్సిన ప్రతిపక్ష నేత జూమ్‌లో కుల కలం రేపుతున్నాడని మండిపడ్డారు.

రోజుకు నాలుగైదు గంటలు కులాలు, మతాల పేరుతో చిచ్చుపెట్టే చర్చలు జరుపుతున్నాడని అన్నారు. బాబు ఆలోచనలు సొంత పార్టీ వాళ్లకీ అంతుబట్టనంత లోతుగా ఉంటాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘50 ఇళ్లకో కార్యకర్తను నియమిస్తాడట, కామెడీ ఏమిటంటే, వాళ్లను మాలోకం లీడ్ చేస్తాడట. ఏ ఇంట్లో పప్పు వండాలో ఆరా తీయించడానికా కొడుక్కి పెత్తనం అని జనం నవ్వుకుంటున్నారు’అని విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.

చదవండి: చంద్రబాబు జూమ్‌ పార్టీ అధ్యక్షుడు: మంత్రి అనిల్‌

మరిన్ని వార్తలు