Huzurabad Bypoll Results: వెక్కి వెక్కి ఏడ్చిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు?

3 Nov, 2021 08:36 IST|Sakshi

Gellu Srinivas Yadav On Huzurabab Election Results:  90 శాతం మంది ప్రజా ప్రతినిధులు టీఆర్‌ఎస్‌లో ఉన్నా.. చివరికి ఓటర్లు మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కే పట్టం కట్టారు. హుజురాబాద్‌ ఉప ఎన్నిక ఫలితాల్లో 24,068 ఓట్ల మెజారీటితో బీజేపీ సత్తాచాటిన విషయం తెలిసిందే. తనకు ప్రజల మద్దతు ఉందన్న విశ్వాసంతో టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి బయటకు వచ్చిన రాజేందర్‌ ఉప ఎన్నికలో గెలిచి జిల్లాలో మరోసారి తన బలాన్ని చాటుకున్నారు. ఈటల రాజేందర్‌కు 1,06,780 వేల ఓట్లు రాగా.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ 82,712 ఓట్లతో రెండో స్థానానికి పరిమితయ్యారు.
చదవండి: గిట్లెట్లాయే: జితేందర్‌ వర్సెస్‌ హరీశ్.. రెండు సార్లు పైచేయి ఒకరిదే

ఇక ఉప ఎన్నిక ఫలితంపై గెల్లు శ్రీనివాస్‌ స్పందిస్తూ హుజూరాబాద్‌లో నైతిక విజయం తనదే అన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. అయితే, ఎన్నికల ఫలితాలు ప్రతికూలంగా వస్తుండటంతో ఆయన తన సన్నిహితుల వద్ద వెక్కి వెక్కి ఏడ్చినట్టుగా ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. హుజురాబాద్‌ ఉప ఎన్నిక ఫలితాల్లో 9వ రౌండ్‌ తర్వాత బీజేపీ 5 వేల ఓట్లతో ఆధిక్యంలో ఉందని, ఆసమయంలో గెల్లు కంటతడి పెట్టిన్నట్లు సౌమిత్‌ యక్కటి అనే వ్యక్తి ట్విటర్‌లో పోస్టు చేశారు. అయితే ఈ వీడియో ఎంతవరకు నిజమనేది క్లారిటీ లేదు. ఫలితాల నేపథ్యంలో వైరల్‌గా మారింది.
చదవండి: Huzurabad Bypoll:1978 నుంచి కాంగ్రెస్‌కు నో చాన్స్‌..

మరిన్ని వార్తలు