రసవత్తరంగా ‘హుజురాబాద్’ రాజకీయాలు

29 Jun, 2021 19:09 IST|Sakshi

టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం

సాక్షి, కరీంనగర్‌: హుజురాబాద్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఉప ఎన్నిక ఎప్పుడనేది స్పష్టంగా తెలియకపోయినప్పటికీ రాజకీయ పార్టీల నేతలు హల్‌చల్‌ చేస్తున్నారు. ముగ్గురు మంత్రులు నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ జమ్మికుంట వీణవంక మండలాల్లో పర్యటించి ఈటలపై విమర్శలు సంధించారు. ఈటల స్వప్రయోజనాల కోసమే ప్రయత్నించారే తప్ప ఏనాడు నియోజకవర్గ అభివృద్ధి గురించి  పట్టించుకోలేదని ఆరోపించారు.

అభివృద్ధి పేరుతో పార్టీ కార్యకర్తల సమావేశాలు నిర్వహించడం పట్ల బీజేపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం హుజురాబాద్‌లో ఏవిధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో మిగతా నియోజకవర్గాల్లో అదేవిధంగా చేపట్టాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ తీవ్రమవుతుండడంతో ఏం జరుగుతుందో అర్థం కాక నియోజకవర్గ ప్రజలు అయోమయంలో ఉన్నారు.

చదవండి: హుజూరాబాద్‌లో ‘సోషల్‌’ వార్‌కు రెడీ..
రేవంత్‌రెడ్డి వ్యూహాత్మక అడుగులు: ఆసక్తికర భేటీ

మరిన్ని వార్తలు