మహారాష్ట్రలో గులాబీ జెండా ఎగురవేస్తాం: తెలంగాణ సీఎం కేసీఆర్‌

26 Mar, 2023 16:20 IST|Sakshi

నాందేడ్‌: మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం నాందేడ్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో కేసీఆర్‌ ప్రసంగించారు.

‘స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా ప్రజలు బతుకులు మారలేదు.మహారాష్ట్రలో సాగు, తాగునీరు అందుబాటులో లేరు. తెలంగాణ మోడల్‌గా ప్రతి రైతుకు రూ. 10 వేలు ఇవ్వాలి. మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో గులాబీ జెండీ ఎగురవేస్తాం. రైతు బీమా ద్వారా తెలంగాణ రైతులకు రూ. 5 లక్షలు ఇస్తున్నాం. రైతులకు 24 గంటల పాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్‌ అందించాలి.

రైతుల ఉత్పత్తిని ప్రభుత్వమే కొనాలి.దేవేంద్ర ఫడ్నవీస్‌ హామీ ఇస్తే నేను మహారాష్ట్రకు రావడం మానేస్తా.మహారాష్ట్రలో మీకేం పని అని ఫడ్నవీస్‌ నన్ను ఉద్దేశించి అన్నారు. భారత పౌరుడిగా నేను ప్రతి రాష్ట్రానికి వెళ్తాను. దేశంలో సరిపడా నీటి నిల్వలు ఉన్నాయి. కానీ కనీసం తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నాం. మహారాష్ట్రలో ప్రతి ఎకరానికి సాగు నీరు అందిస్తాం. త్వరలో దేశంలో రైతు తుఫాన్‌ రాబోతుంది.. దాన్ని ఎవరూ ఆపలేరు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి మహారాష్ట్రలోనూ జరగాలి. రైతుల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తాం’  అని కేసీఆర్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు