ఇప్పుడేమంటారు మోదీ సార్‌ : ఆర్జీవీ

2 May, 2021 16:30 IST|Sakshi

హోరాహోరిగా సాగిన పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఎంసీ విజయం దిశగా దూసుకెళ్తోంది. దాదాపు 200 స్థానాలకు పైగా అధిక్యంగా నిలిచి ప్రతిపక్ష బీజేపీకి గట్టి షాక్‌ ఇచ్చింది. మమతా బెనర్జీ పని అయిపోయింది, ఇక ఆమె రెస్ట్‌ తీసుకుంటే మంచిదని ఎద్దేవా చేసిన బీజేపీ నేతలకు గట్టి షాకిచ్చారు బెంగాల్‌ ప్రజలు. ఒంటి కాలుతోనే బెంగాల్‌లో విజయం సాధిస్తానని శపథం చేసిన దీదీ.. అన్నట్టుగానే భారీ ఆధిక్యంతో హ్యాట్రిక్‌ విజయం దిశగా దూసుకెళ్తున్నారు.

బెంగాల్‌లో మోదీ- అమిత్‌ షా వ్యూహం బెడిసికొట్టింది. నిన్నటి వరకు బెంగాల్లో దీదీ పని అయిపోయిందని ఎద్దేవా చేసిన మోదీ, అమిత్‌ షాలకు బెంగాల్‌ ప్రజలు షాకిచ్చారు. ఇదిలా ఉంటే దేశంలో కరోనా కేసుసు పెరిగినప్పటి నుంచి బీజేపీ నేతలు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు చేస్తూ వస్తున్న సంచలన దర్శకుడు.. తాజాగా బెంగాల్‌ ఫలితాలపై కూడా తనదైన శైలీలో స్పందించారు. ట్విటర్‌ వేదికగా ప్రధాని మోదీకి చురకలు అంటించారు. ‘నరేంద్ర మోదీ సార్‌.. నిన్నటి వరకు దీదీ ఫినిష్‌ అని అన్నారు. మరి ఇప్పుడేమంటారు సార్’ అని ట్విటర్‌ వేదికగా ప్రశ్నించారు. 
 

అంతకు ముందు మరో ట్వీట్‌లో సోనియాకు క్షమాపణలు చెబుతానని పేర్కొన్నారు. ‘నరేంద్రమోదీ మృత్యు వ్యాపారి నరేంద్రమోదీ ఓ మృత్యు వ్యాపారి అంటూ 2014లో సోనియా గాంధీ ఆరోపణలు చేస్తే నాకు అప్పుడు సరిగా అర్థం కాలేదు. ఆమెకు అంత గొప్ప విజనరీ ఉంటుందని నేను ఊహించలేదు. అందుకు నేను బేషరుతుగా సోనియా గాంధీకి క్షమాపణ చెబుతున్నాను. ఒకవేళ వీలైతే నీ కాళ్లను ఫోటో తీసి పంపండి. వాటిని డిజిటల్ రూపంలో తాకి మొక్కుతాను’ అని వర్మ ట్వీట్ చేశారు

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు