మోదీకి షాకిచ్చిన దీదీ: వైరలవుతున్న మీమ్స్‌

2 May, 2021 12:45 IST|Sakshi

 స్పష్టమైన ఆధిక్యంతో  దూసుకుపోతున్న టీఎంసీ

నందీగ్రామ్‌లో  భారీగా పుంజుకున్న మమతా బెనర్జీ

కోలకత : పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల పోరు రాజకీయ ప్రముఖులనుంచి సామాన్యుల దాకా దేశవ్యాప్తంగా తీవ్ర  ఉత్కంఠను రాజేసింది.  బెంగాల్‌ టీఎంసీ కోటలో పాగా వేయాలని  బీజేపీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఎన్నికల వ్యూహాన్ని రచించింది. అధాకార టీఎంసీ నుంచి కీలక నాయకులను తనపైపు తిప్పుకుని ఎలాగైనా దీదీని దెబ్బకొట్టాలని పావులు కదిపింది.  ఈ క్రమంలో మమతకు కీలకమైన నందీగ్రామ్‌నుంచే టీఎంసీ మాజీ మంత్రి సువేందు అధికారిని బీజేపీ తరపున బరిలో నిలిపి గట్టి సవాల్‌ విసిరింది. దీంతో తాను కూడా నందీగ్రామ్‌నుంచే పోటీ చేస్తానని ప్రకటించిన దీదీ బీజేపీకి ప్రతిసవాల్‌ విసిరారు.

బెంగాల్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి, నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌ షా హోరెత్తించారు. అటు ఎన్నికల ర్యాలీలో గాయపడిన మమత కూడా ఏమాత్రం తగ్గకుండా వీల్‌చైర్‌లోనే ప్రచార పర్వాన్ని కొనసాగించి బెంగాల్‌  ఓటర్ల మనసు గెల్చుకునేందుకు ప్రయత్నించారు. దీంతో బెంగాల్‌ బెబ్బులి అంటూ ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తాయి. తాజాగా 200 పైగా స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యంతో టీఎంసీ దూసుకుపోతున్న క్రమంలో మమతపై సోషల్‌ మీడియాలో మీమ్స్‌ హల్‌చల్‌ చేస్తున్నాయి. బెంగాలీలు దుర్గా మాత ఆరాధకులంటూ వ్యాఖ్యలు వెల్లువెత్తాయి.  (బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు: టీఎంసీ జోరు, మమత ఆధిక్యం)

కాగా శనివారం ఉదయం ఆరంభమైన బెంగాల్‌  అసెంబ్లీ  ఎన్నికల  ఓట్ల లెక్కింపులో టీఎంసీ భారీ మెజార్టీ దిశగా దూసుకుపోతోంది.  మొత్తం 292 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరగ్గా 204  స్థానాల్లో లీడ్‌ లో ఉండి బీజీపీకి ఊహించని షాక్‌ ఇస్తోంది. ప్రధానంగా నందీగ్రామ్‌లో సీఎం మమత తొలి రౌండ్‌నుంచి సువేందు అధికారి కంటే వెనకబడతూ వచ్చారు. కానీ నాలుగో రౌండ్‌కి వచ్చేసరికి దీదీ  ముందుకు దూసుకువచ్చారు.  సువేందు అధికారిపై ఇప్పటిదాకా దాదాపు 8వేలకు పైగా ఓట్ల వెనుకంజలో ఉన్న మమత 6 వ రౌండ్‌కు 1427 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతుండటం విశేషం.

>
మరిన్ని వార్తలు