‘ఇది రాజ్యాంగ విధి.. షెడ్యూల్‌ ప్రకారమే పర్యటిస్తా’

10 May, 2021 18:58 IST|Sakshi

కోల్‌కతా: ఇటీవల పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో చెలరేగిన హింసల పై పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్నట్లు ఆయన తెలిపారు. సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నా రాజ్యాంగ విధిలో భాగంగా, నేను రాష్ట్రంలోని హింసాకాండ జరిగిన ప్రాంతాలను సందర్శించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు  ప్రభుత్వాన్ని ఏర్పాట్లు చేయమని కూడా కోరాను. ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎటువంటి స్పందన లేదని అసహనం వ్యక్తం చేశారు. 

ప్రభుత్వం స్పందించకున్నా నేను నా సొంత ఏర్పాట్లు చేసుకుని అనుకున్న ప్రకారమే పర్యటిస్తానని గవర్నర్‌ తెలిపారు. రాష్ట్రంలో టీఎంసీ సర్కార్‌కు జవాబుదారీతనం లోపించిందని ఆయన మండిపడ్డారు. ఫలితాల తరువాత, రాష్ట్రంలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. ప్రతీకార హింస, కాల్పుల చర్యలు, దోపిడీ వంటివి జరుగుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. కనుక వీటి పై తక్షణమే స్పందించకుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిస్థితి దయనీయంగా మారే అవకాశాలు ఉన్నట్లు ధన్‌ఖర్‌ తెలిపారు.

( చదవండి: West Bengal: 43 మంది టీఎంసీ సభ్యుల ప్రమాణ స్వీకారం )

మరిన్ని వార్తలు