వైఎస్సార్‌సీపీలోకి భారీగా చేరిన టీడీపీ, జనసేన కార్యకర్తలు

3 Jan, 2024 07:15 IST|Sakshi
అత్తిలిలో మంత్రి కారుమూరి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ, జనసేన కార్యకర్తలు 

‘పశ్చిమ’లో మంత్రి కారుమూరి సమక్షంలో చేరిక

అత్తిలి(పశ్చిమగోదావరి): వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు ఆకర్షితులవుతున్నారని, వారు వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు.

పశ్చిమగోదావరి జిల్లా అత్తిలిలో మంగళవారం చేపట్టిన ప్రజా దీవెన పాద­యాత్ర కార్యక్రమంలో మంత్రి సమక్షంలో జనసేన, టీడీపీలకు చెందిన 150 మంది వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరికి మంత్రి కారుమూరి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘనవిజయానికి కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అత్తిలి ఏఎంసీ చైర్మన్‌ బుద్దరాతి భరణీ ప్రసాద్, పార్టీ మండల అధ్యక్షుడు పైబోయిన సత్యనారాయణ, ఎంపీపీ మక్కా సూర్యనారాయణ, జెడ్పీటీసీ సభ్యురాలు అడ్డాల జానకి, సర్పంచ్‌ గంటా విజేత నాగరాజు, జెడ్పీ కోఆప్షన్‌ మెంబర్‌ మహ్మద్‌ అబీబుద్దీన్, వైస్‌ ఎంపీపీలు సుంకర నాగేశ్వరరావు, దారం శిరీష, అత్తిలి టౌన్‌ అధ్యక్షుడు పోలినాటి చంద్రరావు, ఉపసర్పంచ్‌ మద్దాల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: జన బలమే గీటురాయి..

whatsapp channel

మరిన్ని వార్తలు