కుటుంబ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్‌ జాతీయ రాగం

30 Sep, 2022 08:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎనిమిదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలుజేసిన కేసీఆర్‌ ఇప్పుడు జాతీయ పార్టీ పెడతానని చెప్పడం విడ్డూరంగా ఉందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్‌ ఎద్దేవా చేశారు. తన కుటుంబ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్‌ జాతీయ రాగం ఆలపిస్తున్నారని, అయినా కేసీఆర్‌ను నమ్మే నేతలు జాతీయ స్థాయిలో ఎవరూ లేరని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ల లోపాయికారీ ఒప్పందాల్లో భాగమే కేసీఆర్‌ జాతీయ పార్టీ అని అన్నారు.
చదవండి: బుల్లెట్లతో ఎమ్మెల్యే పేరు.. సీఆర్పీఎఫ్‌ జవాన్‌ నిర్వాకం

మరిన్ని వార్తలు