రైతుల ఆత్మహత్యల నివారణకు ప్రత్యేక చర్యలు: అరవింద్‌ కేజ్రివాల్‌

28 Oct, 2021 19:54 IST|Sakshi

చంఢీఘడ్‌: రైతుల ఆత్మహత్యలను నివారించడానికి ఎలాంటి చర్యలనైనా తీసుకుంటామని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రివాల్‌ అన్నారు. పంజాబ్‌లోని మాన్సాలో రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి ఏ ఒక్క రైతు కూడా ఆత్మహత్యకు పాల్పడకుండా చూస్తామని కేజ్రివాల్‌ అన్నారు. స్వాత్రంత్ర్యం వచ్చి 70 ఏళ్లు గడిచినప్పటికి  రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం  బాధాకరమన్నారు.

రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక ప్రణాళిక రూపోందిస్తున్నామని సీఎం అరవింద్‌ కేజ్రివాల్‌ అన్నారు. మీకు నేను.. వాగ్దానం చేసి చెబుతున్నాను..  ఒక నెల తర్వాత మళ్లి వచ్చాక దాని వివరాలు తెలియజేస్తామని తెలిపారు. పంజాబ్‌లో వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికలలో ఆమ్‌ ఆద్మీ పార్టీ నుంచి 117 స్థానాల్లో అభ్యర్థులు పోటిచేస్తారని అన్నారు. కాగా, ఎన్నికలలో ఆమ్‌ ఆద్మీపార్టీ అఖండ విజయం సాధిస్తుందని తెలిపారు. అరవింద్‌ కేజ్రివాల్‌ రెండు రోజులపాటు పంజాబ్‌లో పర్యటిస్తున్నారు. ఆయన రేపు(శుక్రవారం) భటిండా వ్యాపారవేత్తలతో సమావేశం కానున్నారు.

చదవండి: ఏపీ గవర్నర్‌ను కలిసిన సీఎం వైఎస్‌ జగన్‌ దంపతులు

మరిన్ని వార్తలు