‘టీకాలను భారత్‌లో కన్నా విదేశాలకే అధికంగా పంపిణీ చేశాం’

17 May, 2021 16:47 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ ఉగ్రరూపం దాల్చుతోంది. ఈ నేపథ్యంలో మహమ్మారికి అడ్డుకట్ట వేసే వ్యాక్సిన్లను రాష్ట్రాలకు సరిపడా సరఫరా చేయడంలో కేంద్రం విఫలమయ్యింది. ఇందుకు మోదీ సర్కార్‌ అనుసరించిన వ్యాక్సిన్‌ విధానం కారణంగానే ప్రస్తుతం దేశంలో టీకాల కొరత ఏర్పడిందని జాతీయ స్థాయిలో పలువురు నేతలు మండిపడుతున్నారు. తాజాగా మాజీ బీజేపీ, ప్రస్తుత తృణమూల్ నేత యశ్వంత్ సిన్హా కేంద్ర విధానాలపై ధ్వజమెత్తారు.

ఆయన తన ట్విటర్‌లో.. ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారి టీకాలకు సంబంధించి తెలుపుతున్న 10 సెకండ్ల వీడియోను ట్వీట్‌ చేశారు. “ఈ పది సెకన్ల వీడియో మోదీ భండారాన్ని బయటపెట్టింది. భారత్ తన ప్రజలకు ఇచ్చిన దానికన్నా అధిక వ్యాక్సిన్‌లను విదేశాలకు పంపిందని ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారి చెప్పారు. మోదీ ఇప్పుడు నిజంగానే ప్రపంచ నేత. భారతీయులు ఎలా పోతేనేం” అని కామెంట్‌ పెట్టి  తీవ్రస్థాయిలో ప్రధానిపై విమర్శలు గుప్పించారు. ఈ కామెంట్‌తో పాటుగా ఆయన ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో భారత రాయబారి ప్రసంగించిన వీడియో క్లిపింగ్‌ను జతచేశారు. ఆ వీడియోలో.. భారత్‌లో సరఫరా చేసిన టీకాల కన్నా అధికంగా 70 దేశాలకు భారత్‌ టీకాలను సరఫరా చేసినట్లు రాయబారి  తెలిపారు. ఇటీవల పరిమిత టీకాల కారణంగా ఢిల్లీలో నాలుగు రోజుల క్రితమే 18-44 ఏళ్ల పిల్లలకు టీకాలు ఆపేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 

( చదవండి: వ్యాక్సిన్ల సంఖ్య ఎందుకు తగ్గుతోంది: చిదంబరం ఫైర్‌ )

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు