‘మోదీ విజన్‌తోనే మెరుగైన ఫలితాలు’

10 Nov, 2020 18:29 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో కాషాయ పార్టీ బిహార్‌ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు రాబట్టిందని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ అన్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ బిహార్‌లో ఘన విజయం సాధించిందని అన్నారు. ఆర్జేడీ సారథ్యంలోని మహాకూటమిపై విస్పష్ట ఆధిక్యం కనబరిచిందని చెప్పారు. చదవండి : కోవిడ్‌-19 : ప్రపంచానికి భారత్‌ బాసట

ఇక 243 స్ధానాలు కలిగిన బిహార్‌ అసెంబ్లీలో ఎన్డీయే కూటమి 123 స్ధానాల్లో ఆధిక్యంతో మేజిక్‌ మార్క్‌కు చేరువ కాగా, మహాకూటమి 112 స్ధానాల్లో ముందంజలో ఉండగా ఇతరులు 8 స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తున్నారు. మరోవైపు యూపీలో జరిగిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో ఆరు స్ధానాల్లో బీజేపీ విజయదుంధుభి మోగించడం పట్ల పార్టీ కార్యకర్తలను యోగి ఆదిత్యానాథ్‌ అభినందించారు. ఇక మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించింది. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా