రైతు సజీవదహనంపై వైఎస్‌ షర్మిల కీలక వ్యాఖ్యలు

20 Jun, 2021 02:41 IST|Sakshi

పరిహారం చెల్లింపులో పరిహాసం

ముంపు బాధితుల ప్రాణాలు తీసిన పాపం సర్కారుదే 

వేములఘాట్‌ రైతు ఆత్మహత్యపై షర్మిల స్పందన

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పరిహారం అందక బాధితులు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటుంటే దొర గారికి చీమకుట్టినట్లైనా లేదని దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్‌ షర్మిల విమర్శించారు. ముంపు బాధితుల ప్రాణాలు తీసిన పాపం సర్కారుదేనని దుయ్యబట్టారు. పరిహారం చెల్లింపులో ఎందుకింత పరిహాసమని ప్రశ్నించారు. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు పనులు పూర్తి కావస్తున్నా..పరిహారం, ఇళ్లు, ప్లాట్లు ఇవ్వకుండా ఎర్రవల్లి, పల్లెపహాడ్, వేములఘాట్, ఏటిగట్టు కిష్టాపూర్‌ గ్రామాలకు నీళ్లు, కరెంట్‌ నిలిపివేయడాన్ని ఆక్షేపించారు. 70 ఏళ్ల వయసులో రైతు మల్లారెడ్డి ఆత్మహత్యకు ఒడిగట్టాడంటే ఆయన ఎంత క్షోభను అనుభవించి ఉంటాడో ఆలోచించాలన్నారు. అధికారుల నిర్లక్ష్యమే మల్లారెడ్డిని బలి తీసుకుందని ఆమె ఆరోపించారు. ఈ మేరకు షర్మిల కార్యాలయం శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. 

మరిన్ని వార్తలు