అప్పుల రాష్ట్రంగా మార్చిన కేసీఆర్‌: షర్మిల  

28 Mar, 2022 02:18 IST|Sakshi
సూర్యాపేట జిల్లా మాలిపురంలో మహిళలతో మాట్లాడుతున్న షర్మిల

తిరుమలగిరి(తుంగతుర్తి): ఆర్థికంగా మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకే దక్కిందని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ఎద్దేవా చేశారు. ఆదివారం వైఎస్సార్‌ టీపీ ప్రజా ప్రస్థానం పాదయాత్ర సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలోని తిరుమలగిరి, మాలిపురం, బండ్లపల్లి, గుండెపురి, వెలిశాలలో సాగింది.

ఈ సందర్భంగా పలువురు రైతులు, వ్యవసాయ కూలీలతో మాట్లాడారు. అనంతరం ఆమె మాట్లాడుతూ...రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోందని, నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ప్రతిపక్షాలు మూగబోయాయని, ప్రశ్నించే గొంతుకలను అణిచి వేస్తున్నారని ఆరోపించారు. రైతులు పండించిన ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వమే కొనాలన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్‌ ధరలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారన్నారు. దళితులకు 6 లక్షల ఎకరాల భూమి పంచారని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత విద్యుత్, వైద్యం, ఇందిరమ్మ ఇల్లు, ఆరోగ్యశ్రీ కల్పించిన ఘనత వైఎస్సార్‌దేనని గుర్తు చేశారు.    

మరిన్ని వార్తలు