కేసీఆర్‌.. అన్ని వర్గాలనూ మోసం చేశారు

17 Jun, 2022 01:34 IST|Sakshi
ఖమ్మం ముస్తఫానగర్‌లో ఆటో నడుపుతున్న షర్మిల

ఖమ్మం బహిరంగ సభలో వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, రైతుల రుణమాఫీ, పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, వృద్ధులకు పింఛన్లు.. ఇలా ఏ హామీని నెరవేర్చకుండా తెలంగాణలో కేసీఆర్‌ మోసం చేయని వర్గం లేదని వైఎస్సార్‌ టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ధ్వజమెత్తారు. ఆమె చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర గురువారం ఖమ్మం జిల్లా ధంసలాపురం, కొత్తూరు మీదుగా జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో సాగింది.

ఈ సందర్భంగా బస్టాండ్‌ సర్కిల్‌ వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభలో షర్మిల ప్రసంగించారు. కేసీఆర్‌ ఇంట్లో అందరికీ ఉద్యోగాలు ఉంటే ప్రజలు మాత్రం అడుక్కు తినాలా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ ఉద్యమంతోనే ఇటీవల ప్రభుత్వంలో చలనం వచ్చినా పది, ఇరవైవేల ఉద్యోగాలే భర్తీ చేస్తూ మరో మోసానికి తెర లేపారని విమర్శించారు. ప్రాజెక్టుల పేరుతో రూ.70 వేల కోట్లు దోచు కోవడమే కాక రూ.లక్షల కోట్లు అప్పు తెచ్చి ప్రజలపై భారం మోపు తున్నారన్నారు.

ప్రశ్నించే ప్రతిపక్షాలు గుడ్డి గుర్రాల పళ్లు తోముతు న్నాయని ఎద్దేవా చేశారు. ‘ఇక్కడ ఉన్నది వైఎస్సార్‌ బిడ్డ.. పులి కడుపున పులే పుడు తుంది.. నా గతం ఇక్కడే.. నా బతుకు ఇక్క డే.. ఈ గడ్డకు సేవ చేసే హక్కు నాకు ఉంది’ అని షర్మిల అన్నారు. ఖమ్మం లో పువ్వాడ వేధింపులు తట్టుకోలేక ఓ యువ కుడు ఆత్మహత్య చేసుకు న్నాడని ఆరోపించారు. భూమి కబ్జా చేశారని, ఏ కాంట్రాక్ట్‌ చూసినా అత ని బినామీలే చేస్తున్నా రని ఆరోపించారు. 

మరిన్ని వార్తలు