ప్రాజెక్టుల పేరుతో భారీ అవినీతి: షర్మిల 

9 Aug, 2022 05:11 IST|Sakshi
గవర్నర్‌కు వినతి పత్రం ఇస్తున్న షర్మిల

గవర్నర్‌ దృష్టికి కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలు 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ప్రాజెక్టుల పేరిట భారీ అవినీతి జరిగిందని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కలసి ప్రాజెక్టుల్లో అవినీతిపై వినతిపత్రం సమర్పించారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలను గవర్నర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరంపై ఆడిట్‌ జరగాలని, సీబీఐ విచారణ జరిపించాలని కోరామని చెప్పారు.

రాష్ట్రంలోని 90 శాతం ప్రాజెక్టులను ఒకే సంస్థకు అప్పగించడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. సీఎం కేసీఆర్‌ మానసపుత్రిక కాళేశ్వరం మూడేళ్లలో మునిగిపోయిందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరంపై సీబీఐతో దర్యాప్తు జరిపించేలా చూస్తామని గవర్నర్‌ హామీ ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే ఎమ్మెల్యేలంతా అధికార పార్టీ సంకనెక్కుతున్నారన్నారు. ఇటీవల వచ్చిన వరదలతో లక్షల్లో నష్టం జరిగితే బాధితులకు రూ.10 వేల చొప్పున ఇస్తామని చెప్పిన కేసీఆర్‌ ఆ మాటను కూడా నిలబెట్టుకోలేదన్నారు. 

మరిన్ని వార్తలు