ప్రభుత్వం, పోలీసులు చేయలేని న్యాయం దేవుడు చేశాడు: వైఎస్‌ షర్మిల

16 Sep, 2021 19:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సైదాబాద్‌ చిన్నారి అత్యాచార, హత్య ఘటనలో తాము దీక్ష చేసిన తర్వాతే ప్రభుత్వంలో కదలిక వచ్చిందని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల  అన్నారు. శాంతియుతంగా దీక్ష చేస్తుంటే రాత్రి 2 గంటలకు 200మంది పోలీసులు తమపై దాడిచేశారని పేర్కొన్నారు. తమను బలవంతంగా కార్లలోకి ఎక్కించి హౌస్ అరెస్ట్ చేశారని విమర్శించారు. దీక్ష చేస్తున్న తమపై దాడి చేయడం తాలిబన్ల చర్య వంటిదని తెలిపారు. 6 ఏళ్ళ చిన్నారిపై అత్యాచారం, హత్య జరిగి 7 రోజులు గడిచినా ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడానికి కారణం ఆ కుటుంబ పేదరికమే అని ఆరోపించారు.

చిన్నారికి ప్రభుత్వం, పోలీసులు చేయలేని న్యాయం దేవుడు చేశారన్నారు. కేసీఆర్‌ సీఎం అయ్యాక 300 శాతం మద్యం అమ్మకాలు పెరిగాయని విమర్శించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక 300 శాతం మహిళలపై దాడులు పెరిగాయన్నారు. మత్తు పదార్థాల వల్ల యువత చెడిపోతుందని, ప్రభుత్వం పట్టించుకోదన్న ధైర్యమే దాడులకు కారణమవుతోందని అన్నారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు