వడ్ల కొనుగోళ్లపై టీఆర్‌ఎస్, బీజేపీ డ్రామాలు 

8 Dec, 2021 03:21 IST|Sakshi

వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే విషయంలో టీఆర్‌ఎస్, బీజేపీలు ఆడుతున్న డ్రామాలు బయటపడ్డాయని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల అన్నారు. ఇప్పటికీ వడ్ల కొనుగోళ్ల విషయంలో ఆయా పార్టీలు గందరగోళాన్ని సృష్టిస్తున్నాయని మం డిపడ్డారు. దొంగ లెక్కలతో కాలక్షేపం చేస్తున్నారంటూ మంగళవారం ఆమె ట్విట్టర్‌ వేదికగా.. టీఆర్‌ఎస్, బీజేపీ వైఖరిని దుయ్యబటా ్టరు.

తెలంగాణ నుంచి వడ్లు రావడం లేదని కేంద్రం చెబుతుందని పేర్కొన్నారు. మరో పక్క యాసంగిలో వరి వేయొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడాన్ని ఆక్షేపించారు. ఫీల్డ్‌ అసిస్టెంట్ల విషయంలో కేసీఆర్‌ నిరంకుశ వైఖరిని అవలంబిస్తోందన్నారు. చివరికి ఉద్యోగాల భర్తీ కూడా ఎన్నికల హామీగానే మిగిలిపోయిందన్నారు. ఓట్ల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ యువతకు దొంగ హామీలు ఇచ్చారని విమర్శించారు. రాష్ట్రంలో 28 లక్షల మంది నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు