పిచ్చి ముదిరి అయ్యన్న బూతులు మాట్లాడుతున్నారు 

18 Sep, 2021 07:21 IST|Sakshi
సన్యాసిపాత్రుడు ( ఫైల్‌ ఫోటో )

సోదరుడిపై ధ్వజమెత్తిన చింతకాయల సన్యాసిపాత్రుడు

నర్సీపట్నం: టీడీపీ సీనియర్‌ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు మద్యంతోపాటు గంజాయి కూడా సేవించి ఇష్టం వచి్చనట్లు మాట్లాడుతున్నాడని ఆయన సోదరుడు, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు చింతకాయల సన్యాసిపాత్రుడు ఘాటుగా విమర్శించారు. తన సతీమణి, డీసీసీబీ చైర్‌పర్సన్‌ అనితతో కలిసి శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అయ్యన్నపాత్రుడి పిచ్చి మరింత ముదిరిందని.. బూతులు తప్ప ఆయన నోటి నుంచి మంచి మాటలు రావటంలేదని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలంతా మనసారా ప్రేమించే ముఖ్యమంత్రిని, హోంమంత్రిని ఉద్దేశించి బూతులు మాట్లాడే హక్కు ఆయనకు ఎవడిచ్చాడన్నారు.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు, లోకేశ్‌ ఇచి్చన స్క్రిప్ట్‌తో  అయ్యన్నపాత్రుడు నోటికి వచి్చనట్లు మాట్లాడుతున్నాడన్నారు. గంజాయి వ్యాపారం, దోపిడి, భూకబ్జాలు, రౌడీయిజం చేసే అయ్యన్నపాత్రుడు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సీఎంకు బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అయ్యన్నపాత్రుడిని సన్యాసిపాత్రుడు హెచ్చరించారు. 

 

మరిన్ని వార్తలు