సంస్కారం లేని వ్యక్తి అయ్యన్న పాత్రుడు: ధర్మాన కృష్ణదాస్‌

18 Sep, 2021 20:02 IST|Sakshi
ధర్మాన కృష్ణదాస్‌ ( ఫైల్‌ ఫోటో )

సాక్షి, శ్రీకాకుళం: ఎమ్మెల్యే జోగి రమేష్‌పై దాడి హేయమైన చర్య అని మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. అయ్యన్న పాత్రుడికి పిచ్చి మరింత ముదిరిందని మండిపడ్డారు. అయ్యన్న పాత్రుడు సంస్కారం లేని వ్యక్తిలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అయ్యన్న పాత్రుడికి ప్రజలే గుణపాఠం చెబుతారని ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు.

తిరుపతి: దళితులను కించపరచటం టీడీపీ డీఎన్‌ఏలోనే ఉందని.. నిన్నటి ఘటనపై చంద్రబాబు క్షమాపణ చెప్పాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే జోగి రమేష్‌పై టీడీపీ గూండాలు దాడి చేశారన్నారు. చంద్రబాబుకు సీపీఐ రామకృష్ణ పెయిడ్‌ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్నారని పార్థసారధి ధ్వజమెత్తారు.

అనంతపురం: మైనారిటీల పట్ల చంద్రబాబుది కపట ప్రేమ అని.. ఆయన ముస్లింలను ఓటు బ్యాంకుగానే చూశారని ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌ మండిపడ్డారు. కోడెల శివ ప్రసాద్‌రావు మరణానికి చంద్రబాబే కారణమన్నారు. ప్రజాస్వామ్యం గురించి మట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు.

చదవండి:
అయ్యన్న వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ నిరసన
కాకినాడ మేయర్‌పై అక్టోబర్‌ 5న అవిశ్వాస తీర్మానం

మరిన్ని వార్తలు