అమీర్‌బాబు ఇంటి వద్ద వైఎస్సార్‌సీపీ నేతల బైఠాయింపు

19 Oct, 2021 17:21 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: కడప టీడీపీ నేత అమీర్‌బాబు ఇంటి వద్ద ఉద్రికత్త చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత అమీర్‌బాబు ఇంటి వద్ద వైఎస్సార్‌సీపీ నేతలు బైఠాయించి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ నేతలకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ నేతలు నినాదాలు చేశారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు