కబ్జాలను కప్పిపుచ్చుకునేందుకే టీడీపీ నేతల దుష్ప్రచారం

12 Jun, 2021 18:08 IST|Sakshi

విశాఖపట్నం: విశాఖ అభివృద్ధిని చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని వైఎస్ఆర్‌సీపీ విశాఖ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ దుయ్యబట్టారు. విశాఖలో ప్రభుత్వ భూములను కబ్జా చేసింది టీడీపీ నేతలే అని ఆరోపించారు. కబ్జా చేసిన భూములను వెనక్కి తీసుకుంటే విమర్శలు చేస్తారా? అంటూ ఆయన ప్రశ్నించారు. దమ్ము, ధైర్యం ఉంటే కబ్జా చేయలేదని టీడీపీ నేతలు నిరూపించుకోవాలని ఆయన  సవాలు విసిరారు.

ఇక విశాఖ ఉత్తర నియోజకవర్గం ఇంఛార్జ్‌ కేకే రాజు  మాట్లాడుతూ.. పేదల సొంతింటి కలను సీఎం వైఎస్‌ జగన్‌ నెరవేరుస్తున్నారని ప్రశంసించారు. కబ్జాలను కప్పిపుచ్చుకునేందుకే టీడీపీ నేతల దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఘాటుగా స్పందించారు.  టీడీపీ అయిదేళ్ల పాలనలో విశాఖ భూములు దోచుకున్నారని విరుచుకుపడ్డారు. భీమిలి.. గాజువాక.. పెందుర్తి.. అనకాపల్లి పరిసరాల్లో వందల ఎకరాలు అన్యాక్రాంతం చేశారని పేర్కొన్నారు.

టీడీపీ నగర అధ్యక్షుడు పల్లా శ్రీను అరవై ఎకరాలు కబ్జా నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్‌ ఉద్యోగుల కోసం దొంగ దీక్షలు చేసే పల్లా శ్రీను స్టీల్ ప్లాంట్ భూములు కబ్జా చేసి కార్మికులను మోసగించారని దుయ్యబట్టారు. తుంగ్లాం....కాపు జగ్గారావు పేటలో పల్లా శ్రీను భూ దందా అందరికీ తెలిసిందేనని అన్నారు.  టీడీపీ నాయకుల కబ్జాలో ఉన్న అసైన్డ్ భూములు అభివృద్ధి కోసం తీసుకుంటే తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేకే రాజు విమర్శించారు.

చదవండి: ‘జగనన్న పచ్చతోరణం’పై ప్రత్యేక దృష్టి: పెద్దిరెడ్డి

మరిన్ని వార్తలు