Eluru Corporation: ఏలూరు మేయర్‌గా నూర్జహాన్‌

30 Jul, 2021 11:34 IST|Sakshi
ఏలూరు మేయర్‌గా ఎన్నికైన నూర్జహాన్‌ ( ఫైల్‌ ఫోటో )

ఏలూరు టౌన్‌: ఏలూరు నగర మేయర్‌ పీఠంపై వైఎస్సార్‌ సీపీ జెండా రెపరెపలాడింది. ఏలూరు కార్పొరేషన్‌ ఆవిర్భవించిన తర్వాత మూడోసారి జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ విజయభేరి మోగించింది. నూతన పాలక వర్గం శుక్రవారం కొలువుదీరింది. నగర మేయర్‌గా నూర్జహాన్‌, డిప్యూటీ మేయర్లుగా జి.శ్రీనివాసరావు, ఎన్‌.సుధీర్‌బాబు ఎన్నికయ్యారు. ఏలూరు కార్పొరేషన్‌లోని 50వ డివిజన్‌ నుంచి గెలుపొందిన నూర్జహాన్‌ రెండోసారి మేయర్‌ అయ్యారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని నగర అభివృద్ధికి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లేందుకు సన్నద్ధం అవుతున్నారు. 2014లో ఆమె తొలిసారి మేయర్‌ పీఠాన్ని అధిరోహించారు.  

రెండో డిప్యూటీ మేయర్‌/వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక..
రెండో డిప్యూటీ మేయర్‌/వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికలో భాగంగా తిరుపతి రెండో డిప్యూటీ మేయర్‌గా భూమన అభినయరెడ్డి ఎన్నికయ్యారు.

విశాఖ: జీవీఎంసీ రెండో డిప్యూటీ మేయర్‌గా కట్టమూరి సతీష్ ఎన్నికయ్యారు

విజయనగరం: నెల్లిమర్ల నగర పంచాయతీ రెండో వైస్ ఛైర్మన్‌గా కారుకొండ కృష్ణ, సాలూరు మున్సిపల్ రెండో వైస్ ఛైర్మన్‌గా అప్పలనాయుడు, బొబ్బిలి మున్సిపల్ రెండో వైస్ ఛైర్మన్‌గా చెలికాని మురళి ఎన్నికయ్యారు. విజయ నగరం డిప్యూటీ మేయర్‌గా కొలగట్ల శ్రావణి ఎన్నికయ్యారు. 

కడప నగరపాలక సంస్థ రెండో డిప్యూటీ మేయర్‌గా నిత్యానందరెడ్డి ఎన్నికయ్యారు. 

అనంతపురం: గుంతకల్లు మున్సిపల్‌ రెండో వైస్ ఛైర్మన్‌గా నైరుతిరెడ్డి ఎన్నికయ్యారు. అనంతపురం కార్పొరేషన్ రెండో డిప్యూటీ మేయర్‌గా విజయ్‌భాస్కర్‌రెడ్డి ఎన్నికయ్యారు. 

మరిన్ని వార్తలు