‘ప్రజల్లో ఆదరణ ఉంటే చంద్రబాబు ఒంటరిగా ఎందుకు పోటీ చేయరు’

7 May, 2022 11:53 IST|Sakshi

సాక్షి, అమరావతి: చంద్రబాబు టూర్‌లో జన స్పందన లేకపోయినప్పటికీ అద్భుత ప్రజాదరణ అంటూ ఎల్లో మీడియా బాకాలు పలుకుతోందని జల వనరుల శాఖ మంత్రి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ప్రజల్లో అంత ఆదరణ ఉంటే చంద్రబాబు ఒంటరిగా ఎందుకు పోటీ చేయరని, అందరూ కలిసి రండి అని ఎందుకు ఆహ్వానిస్తున్నారని ప్రశ్నించారు.

సింగిల్‌గా పోటీ చేసే దమ్ము లేక కలిసి పోటీ చేయడానికి వేదిక సిద్ధం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. ‘పన్నులు లేకుండా ప్రభుత్వాలు నడుస్తాయా.. గతంలో చంద్రబాబు పన్నులు లేకుండానే ప్రభుత్వాన్ని నడిపారా’ అంటూ ప్రశ్నించారు. నవరత్నాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలు కాకూడదని కుట్రలో భాగంగానే ఈ రాద్దాంతమంతా చేస్తుంటే, దానికి ఎల్లో మీడియా వత్తాసు పలుకుతోందని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు