2006లో రాంకీ సంస్థలో ఉద్యోగం చేశా: ఎమ్మెల్యే ఆర్కే

11 Jul, 2021 10:18 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

సాక్షి, గుంటూరు: తన రాజకీయ చరిత్రలో ఒక్క రూపాయి కూడా అవినీతికి పాల్పడలేదని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 2006లో రాంకీ సంస్థలో తాను ఉద్యోగం చేశానని.. 2006-21 వరకు రాంకీ గ్రూప్‌లో తనకు ఏ విధమైన షేర్లు లేవని ఆయన స్పష్టం చేశారు. కంపెనీ షేర్లు, మూలధనం ఏమిటో టీడీపీ నేతలు తెలుసుకోవాలన్నారు.

దుగ్గిరాలలో ఎక్కడ అవినీతి జరిగిందో  దమ్ముంటే నిరూపించాలని టీడీపీ నేతలకు ఆయన సవాల్‌ విసిరారు. మంగళగిరిలో లోకేష్ పై తాను ఆరువేల ఓట్ల మెజార్టీ తో గెలిచానన్నారు. పుష్కరాల పేరుతో తాడేపల్లిలో రెండువేల ఇళ్లను టీడీపీ ప్రభుత్వం తొలగించిందని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు