కొండబాబు కాకినాడను భ్రష్టు పట్టించాడు: ద్వారంపూడి

3 Aug, 2021 18:51 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: భూ కబ్జాలు, పేకాట క్లబ్‌లు, గంజాయి వ్యాపారాలతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొండబాబు, ఆయన కుటుంబ సభ్యులు కాకినాడ నగరాన్ని భ్రష్టు పట్టించారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి ఆరోపించారు. కొండబాబు చేసిన అవినీతి గురించి గత ఎన్నికల్లో చెప్పడం వల్లే ప్రజలు తనను ఎమ్మెల్యేగా గెలిపించారన్నారు.

జగన్నాధపురం మూడవ వంతెన పేరుతో రూ.17 కోట్లు కొండబాబు కాజేయాలని చూస్తే తాను అడ్డుకున్నానని చంద్రశేఖర్‌ రెడ్డి గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో కొండబాబు టీడీపీ కార్పోరేటర్లను పట్టించుకోలేదని.. అందుకే గత సాధారణ ఎన్నికల్లో వారంతా తనకు మద్దతు పలికారని చంద్రశేఖర్‌ రెడ్డి తెలిపారు. 

మరిన్ని వార్తలు