‘ఏపీలో బీజేపీని బాబు జనతా పార్టీగా మార్చేశారు’

5 Aug, 2022 12:37 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీని బాబు జనతా పార్టీగా మార్చేశారంటూ రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ నేత సత్యకుమార్‌ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. సత్యకుమార్‌ టీడీపీకి కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. సత్యకుమార్‌ కాదు.. అసత్యకుమార్‌ అని పేరు పెట్టుకోవాలంటూ ఆయన దుయ్యబట్టారు.
చదవండి: 'టార్గెట్‌ 175' కుప్పం నుంచే తొలి అడుగు

ఒక పార్టీ సభ్యత్వం తీసుకుని మరో పార్టీకి కొమ్ముకాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో స్కాం జరిగిందన్న బీజేపీ విమర్శలు వాస్తవం కాదా అని శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. విశాఖ అభివృద్ధి చెందకుండా అడ్డుపడుతున్న దుర్మార్గుడు చంద్రబాబు అంటూ మండిపడ్డారు. ఒక పార్టీ సభ్యత్వం తీసుకుని మరో పార్టీకి కొమ్ముకాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు