వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యం..

18 Dec, 2020 18:45 IST|Sakshi

చంద్రబాబు జాతీయ నాయకుడు కాదు.. జాతి నాయకుడు

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌

సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్రకు మేలు జరగకుండా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని విశాఖను పరిపాలనా రాజధానిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారని తెలిపారు. (చదవండి: మూడు రాజధానులు పెట్టి తీరుతాం: కొడాలి నాని)

విశాఖపరిపాలన రాజధాని కాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. అభివృద్ధిని అడ్డుకునే వ్యక్తిని నాయకుడు అంటారా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో లేని వనరులు విశాఖపట్నానికి ఉన్నాయని, హైదరాబాద్‌తో పోటీ పడగల నగరం విశాఖపట్నం అని పేర్కొన్నారు. తన చెప్పు చేతుల్లో ఉన్న వ్యవస్థల ద్వారా మూడు రాజధానులను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.(చదవండి: ఏపీ మంత్రివర్గ ఉపసంఘం భేటీ)

‘‘చంద్రబాబు జాతీయ నాయకుడు కాదు.. జాతి నాయకుడు. తన సామాజిక వర్గం మేలు కోసం చంద్రబాబు తాపత్రయం పడుతున్నారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేశానంటున్న చంద్రబాబు కు గ్రేటర్ ఎన్నికలో ఒక సీట్లోనైన డిపాజిట్ వచ్చిందా.?  ఉత్తరాంధ్ర వెనుకబడి ఉండాలనేది చంద్రబాబు కోరిక.

అమరావతిలో తమ కులం తప్ప వేరే కులం ఉండకూడదని చంద్రబాబు కోర్టులో కేసులు వేశారు. ఏడాది కితం రాజధాని వచ్చి ఉంటే ఇంకా విశాఖ అభివృద్ధి చెందేది. ముసలి నక్కలా ఎన్టీఆర్ ఇంటి ముందు కాపలా కాసి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిశాడు. రెఫరెండం అంటున్న చంద్రబాబు ముందు తన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి. టీడీపీ రానున్న రోజుల్లో సర్కస్ కంపెనీల మారుతుందని’ అమర్‌నాథ్‌ దుయ్యబట్టారు.

మరిన్ని వార్తలు