టీడీపీ శవ రాజకీయాలు.. అందుకే హైడ్రామా

17 Aug, 2021 20:37 IST|Sakshi

ప్రభుత్వ పథకాలను పక్కదోవ పట్టించడానికే టీడీపీ హైడ్రామా

టీడీపీ అధికారంలో ఉండగా మైనారిటీలను పట్టించుకోలేదు..

ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌

సాక్షి, కర్నూలు: టీడీపీ నేత నారా లోకేష్ శవ రాజకీయాలు చేస్తున్నారని కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్‌ ఖాన్ మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాజకీయం కోసం ఏడాది తర్వాత నారా లోకేష్ గొనెగండ్ల మండలం ఎర్రబాడు యువతి మృతిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. అనుమానాస్పద మృతి కేసుపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందన్నారు. టీడీపీ ప్రభుత్వంలోనే నంద్యాల ముస్లింలపై అక్రమ కేసులు నమోదు చేశారని హఫీజ్‌ఖాన్ గుర్తుచేశారు. టీడీపీ కేబినెట్‌లో మైనారిటీలకు చోటే లేదన్నారు. టీడీపీ నేతలు ప్రస్తుతం శవ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ పథకాలను పక్కదోవ పట్టించడానికే టీడీపీ హైడ్రామా ఆడుతుందని ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ నిప్పులు చెరిగారు. చదవండి: రమ్య హత్య కేసు: హెడ్‌ కానిస్టేబుల్‌ ధైర్య సాహసాలు

ఏడాది క్రితం ఘటనపై లోకేష్‌ స్పందించడం హాస్యాస్పదం
పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలను మభ్య పెట్టేందుకు నారా లోకేష్ మరోసారి కర్నూలు జిల్లా లో పర్యటించారన్నారు. ఏడాది క్రితం ఘటనపై లోకేష్‌ స్పందించడం హాస్యాస్పదమన్నారు. ఎమ్మెల్యేగా కూడా గెలవలేని లోకేష్‌ మాటలు పట్టించుకోరని కాటసాని అన్నారు. 

లోకేష్ దొడ్డి దారిన కర్నూలు జిల్లా వచ్చాడు..
లోకేష్ దొడ్డి దారిన కర్నూలు జిల్లా వచ్చాడని కర్నూలు మేయర్‌ బీవై రామయ్య ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయాల్సిన నారా లోకేష్, ఓ యువతి కుటుంబాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని బీవై రామయ్య దుయ్యబట్టారు. నారా లోకేష్, చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలు, అసత్య ఆరోపణలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

ఇవీ చదవండి:
ఇడ్లీ, పూరీ అంటే ఇష్టం.. దోశ, వడ కూడా..
‘బుల్లెట్టు బండి’ పాటకు వధువు సూపర్‌ డ్యాన్స్‌.. ముగ్ధుడైన భర్త

మరిన్ని వార్తలు