డబుల్‌ గేమ్‌ ఆడటంలో చంద్రబాబు దిట్ట: ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌

18 Nov, 2022 18:38 IST|Sakshi

సాక్షి, కర్నూలు జిల్లా: కర్నూలుకు హైకోర్టు రాకుండా అడ్డుకుంటారా? అంటూ చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఇక్కడి ప్రజలను రెచ్చగొట్టేలా చంద్రబాబు మాట్లాడుతున్నారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఇలా మాట్లాడతారా? అంటూ దుయ్యబట్టారు.

‘‘శాంతియుతంగా నిరసన చేస్తే దాడులకు దిగుతారా?. చంద్రబాబు నోటికొచ్చినట్టు మాట్లాడినా కర్నూలు ప్రజలు రెచ్చిపోలేదు. గూండాల అవసరం చంద్రబాబుకే ఉంటుంది. డబుల్‌ గేమ్‌ ఆడటంలో చంద్రబాబు దిట్ట. వైఎస్సార్‌సీపీ నేతలపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. విద్యార్థులపై చంద్రబాబు తన గూండాల చేత దాడులు చేయించారు’’ అని ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ నిప్పులు చెరిగారు.
చదవండి: చంద్రబాబు ‘ఆఖరు మాటలు’ దేనికి సంకేతం? 

మరిన్ని వార్తలు