బీసీ అయితే పోలీసులను కొడతారా?

11 Mar, 2021 17:18 IST|Sakshi

ప్రజాస్వామ్యంలో కులాల వారిగా న్యాయాలుండవు

సాక్షి, తాడేపల్లి: కొల్లు రవీంద్ర బీసీ అయినంత మాత్రాన పోలీసులు కొట్టొచ్చా అని ప్రశ్నించారు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్‌. బీసీ అయినంత మాత్రాన చట్టానికి అతీతులు కాదు.. ప్రజాస్వామ్యంలో కులాల వారిగా న్యాయాలు ఉండవు అన్నారు జోగి రమేష్‌. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొల్లు రవీంద్రకు లోకేశ్‌ తరహాలో పిచ్చి ముదిరింది. అందుకే పోలీసులపై దాడి చేశారు. కొల్లు రవీంద్రపై కేసు పెడితే టీడీపీ నేతలు అన్యాయం జరిగినట్లు మాట్లాడుతున్నారు. ఆయన బీసీ అయితే పోలీసులను కొట్టడం.. తిట్టడం వంటివి చేయవచ్చా. చంద్రబాబు ఏనాడైనా కొల్ల రవీంద్రను గౌరవించాడా.. బీసీలను ఏనాడైన ఎదగనిచ్చాడా అని ప్రశ్నించారు.

కొల్లు రవీంద్ర పోలీసు అధికారులతో పిచ్చి పట్టినట్లుగా ప్రవర్తించారు. పోలీసులపై చేయి చేసుకోవడం నేరం కాదా. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ఎవరు తప్పు చేసినా శిక్ష తప్పదు. బలహీన వర్గాలకు అండగా నిలిచింది సీఎం జగన్‌ మాత్రమే. రాష్ట్రంలో చంద్రబాబు టీడీపీ నేతలను నట్టేటా ముంచేస్తాడు అని విమర్శించారు. 

చదవండి:
దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది..

మరిన్ని వార్తలు