ఆ ఊరేగింపు సోమిరెడ్డికే చెల్లింది: కాకాణి

29 Oct, 2020 13:19 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి

సాక్షి, నెల్లూరు: టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తీరుపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సోమిరెడ్డిని అవినీతి సామ్రాట్‌గా అభివర్ణించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై సోమిరెడ్డి విమర్శలను ఆయన తప్పుబట్టారు. ‘‘సోమిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడే జిల్లాలో పసుపు కుంభకోణం జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నపుడు రైతుల ప్రయోజనాలను విస్మరించి మిల్లర్ల వద్ద ముడుపులు తీసుకున్నారు. నీరు-చెట్టు అవినీతి విషయంలో విచారణను అడ్డుకున్నది సోమిరెడ్డి కాదా’’ అని కాకాణి ప్రశ్నించారు.(చదవండి: ‘వారికి ప్రజలే బుద్ధి చెబుతారు’)

2014లో అధికారంలోకి రాగానే పేదల ఇళ్లు కూల్చి వేయించారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ కాగానే సర్వేపల్లిలో స్కూల్ భవనం కూలగొట్టించింది వాస్తవం కాదా అని దుయ్యబట్టారు. సోమిరెడ్డి మంత్రిగా ఉన్నపుడు గ్రామస్తులు అడ్డుకోవడానికి వస్తే పోలీసుల సాయంతో బయటపడ్డాడని, ఆయన అవినీతిపై ఫ్లెక్సీలు గ్రామాల్లో ఊరేగింపు సోమిరెడ్డికే చెల్లిందని కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా