అలాంటి ఫలితాలే రానున్నాయి: కాసు మహేష్‌రెడ్డి

8 Nov, 2021 15:03 IST|Sakshi

సాక్షి, గుంటూరు: గురజాల నియోజకవర్గంలో టీడీపీ చేయలేని అభివృద్ధిని 30 నెలల్లోనే తాము చేసి చూపించామని వైఎస్సార్‌సీపీ కాసు మహేష్‌రెడ్డి అన్నారు. టీడీపీ హయాంలో పిడుగురాళ్లలో ఒక్క ఇంటికైనా కుళాయి ద్వారా నీళ్లిచ్చారా అంటూ ఆయన ప్రశ్నించారు. గురజాల, దాచేపల్లిని నగర పంచాయతీలుగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మార్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయో గురజాల, దాచేపల్లి నగర పంచాయతీల్లో అలాంటి ఫలితాలే రానున్నాయన్నారు.

గురజాల, దాచేపల్లి గ్రామాలను పట్టణాలుగా చేయాలనేది ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షగా మహేష్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ పాలనలో ఉన్నతమైన పట్టణాలుగా తీర్చిదిద్దుతామన్నారు. టీడీపీ హయాంలో ఈ ప్రాంతాల అభివృద్ధికి ఏం చేశారో ఆ పార్టీ నేతలు చెప్పాలని ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు