ఎవరైనా చిన్న కర్మ తర్వాత పెద్ద కర్మ చేస్తారు: కొడాలి నాని

28 Jun, 2022 17:29 IST|Sakshi

సాక్షి, కృష్ణా జిల్లా: నా చిన్నప్పటి నుంచి గుడివాడలో నన్ను ఓడిస్తానని చంద్రబాబు సవాళ్లు విసురుతూనే ఉన్నాడని మాజీ మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేష్‌ కలిసొచ్చినా తనను ఏమీ చేయలేరని అన్నారు. సొంత కొడుకునే గెలిపించలేని అసమర్థుడు చంద్రబాబు అన్నారు. తాను పుట్టిన సొంత నియోజకవర్గంలోనే పార్టీని గెలిపించలేని పనికిమాలిన నాయకుడు చంద్రబాబు అంటూ కొడాలి నాని ఫైర్‌ అయ్యారు.

ఈ మేరకు సాక్షి టీవీతో మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. 'ఎన్టీఆర్‌కు, టీడీపీకి సంబంధం లేదని ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ రాసిన విషయం వాస్తవం కాదా?. ఎన్టీఆర్ నుంచి పార్టీ గుర్తును లాక్కుని వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు. ఎన్టీఆర్ ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదు.. ప్రజా నాయకుడు. బొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టింది నేనే. విగ్రహం శిలాఫలకంపై నాపేరు వాళ్లకి కనిపించలేదా. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎవరైనా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఎన్టీఆర్ విగ్రహానికి గోల్డ్ రంగు ఉంటుంది. ఎన్టీఆర్ విగ్రహానికి ఏ రంగు లైనా వేసుకోవచ్చు' అని కొడాలి నాని పేర్కొన్నారు. 

చిన్న కర్మ చేసిన తర్వాత పెద్ద కర్మ
గుడివాడలో రేపటి టీడీపీ మినీ మహానాడు రద్దుపై కొడాలి నాని సెటైర్స్‌ వేశారు. 'చంద్రబాబుకు ప్రకృతి కూడా సహకరించదు. ఎవరైనా చిన్న కర్మ చేసిన తర్వాత పెద్ద కర్మ చేస్తారు. మహానాడు తర్వాత మినీ మహానాడు చేయడం చంద్రబాబు తెలివి తక్కువ తనానికి నిదర్శనం. చంద్రబాబు సాంప్రదాయాలు పాటించడం తెలుసుకోవాలని కొడాలి నాని సూచించారు.

చదవండి: (Kodali Nani: దత్త పుత్రుడిని, సొంత పుత్రుడిని తుక్కుతుక్కుగా ఓడించాం)

మరిన్ని వార్తలు