‘మేనిఫెస్టో గొప్పతనం సీఎం జగన్‌ పాలనలోనే అర్థమైంది’

5 Jan, 2021 14:44 IST|Sakshi

సాక్షి, విజయవాడ: పేదలకు మేలు చేయాలన్న సీఎం జగన్‌ సంకల్పం ముందు కరోనా కూడా తలొంచిందని ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'గత ఐదేళ్లలో చంద్రబాబు పేదలను పట్టించుకోలేదు. కేవలం ఉపన్యాసాలతో పేదలను కడుపు నింపుకోమనేవాడు. కానీ సీఎం జగన్‌ అలా కాదు. ఎన్నికల మేనిఫెస్టో గొప్పతనం సీఎం జగన్‌ పాలనలోనే అర్థమైంది. చదవండి: (జనవరి 20 వరకు నిర్వహిస్తాం: సీఎం జగన్‌)

ప్రజలకు ఏం కావాలో తెలిసిన వ్యక్తి సీఎం వైఎస్‌ జగన్‌. అటువంటి నాయకుడి దగ్గర మేము పనిచేస్తున్నందుకు గర్వంగా ఉంది. వైఎస్సార్‌ తనకు మించిన దార్శనికుడిని రాష్ట్రానికి ఇచ్చి వెళ్లారు. రామేశ్వరం పోయినా శనేశ్వరం పోలేదన్నట్లు రాష్ట్రానికి చంద్రబాబు రూపంలో దరిద్రం వెంటాడుతూనే ఉంది. పేదల ఇళ్ల పట్టాలు అడ్డుకున్న దౌర్బాగ్యపు బుద్ధి చంద్రబాబుది అంటూ ఎమ్మెల్యే పార్థసారధి ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: (దేశంలో నంబర్‌వన్‌‌గా నిలుపుతాం: మంత్రి సురేష్‌)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు