శవ రాజకీయాల్లో చంద్రబాబు సిద్ధహస్తుడు: మేరుగు నాగార్జున

16 Jan, 2022 16:32 IST|Sakshi

సాక్షి, గుంటూరు: శవ రాజకీయాలు చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని వేమూరు ఎమ్మెల్యే మేరుగు నాగార్జున మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యను రాజకీయం చేసి.. రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో కుట్రలు, కుతంత్రాలకు తావు లేదని స్పష్టం చేశారు. బాబు నీచ రాజకీయాలు ప్రజలకు అర్థమయ్యాయని ఎమ్మెల్యే అన్నారు.

చదవండి: మరోసారి బయటపడ్డ చంద్రబాబు నీచరాజకీయాలు

ఓర్వలేని చంద్రబాబు: ఎమ్మెల్యే ముస్తఫా
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రాష్ట్రాన్ని సంక్షేమం వైపు పరుగులు పెట్టిస్తుంటే.. ఓర్వలేని చంద్రబాబు.. అల్లర్లు సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఎమ్మెల్యే ముస్తఫా మండిపడ్డారు. టీడీపీ నేతలతో కలిసి పల్నాడులో చిచ్చుపెట్టేందుకు పన్నిన కుట్ర చంద్రబాబు ఆడియో ద్వారా బట్టబయలైందన్నారు. రాజకీయ ఉనికి కోసం బాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నీచ రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్‌ చంద్రబాబు: ఎమ్మెల్యే కిలారి రోశయ్య
మాచర్లలో పాతకక్షలతో జరిగిన ఓ హత్యకు రాజకీయ రంగు పులిమి రాష్ట్రంలో అశాంతి సృష్టించాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య మండిపడ్డారు. గుంటూరు జిల్లా టీడీపీ నేతలతో కలిసి చంద్రబాబు పన్నిన కుట్ర.. ఆడియో టేప్‌ల ద్వారా బహిర్గతం అయ్యాయని చెప్పారు. చంద్రబాబు నీచ రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అని మండిపడ్డారు. 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ అని చెప్పుకునే బాబు.. రాజకీయ చరిత్ర అంతా కుట్రలు, కుతంత్రాలేనని ఎమ్మెల్యే కిలారి ధ్వజమెత్తారు.

మరిన్ని వార్తలు