‘తనలాగే పిల్లలు దద్దమ్మలాగా మారాలన్నది లోకేష్ ఉద్దేశ్యం’

17 Jun, 2021 20:44 IST|Sakshi

సాక్షి, తిరుపతి: రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందరి మన్ననలు పొందారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ఇది చూసి చంద్రబాబు ఓర్వలేక దర్నాలు చేయిస్తున్నారని విమర్శించారు. బాధ్యత కలిగిన ప్రతిపక్ష నేతగా ఆయన వ్యవహరించటం లేదని దుయ్యబట్టారు. కేంద్రం నుంచి వ్యాక్సిన్‌లు రాకపోతే ప్రధానమంత్రి నరేంద్రమోదీని కనీసం ప్రశ్నించలేకపోయారని మండిపడ్డారు.

తన నేరాల చిట్టా బయటకు తీస్తే జైలుకు పోవాల్సి వస్తుందని చంద్రబాబుకు భయం వేస్తోందని విమర్శించారు. పరీక్షలు రద్దు చేయాలని లోకేష్ డిమాండ్ చేస్తున్నారని, తనలాగే పిల్లలు కూడా దద్దమ్మలాగా మారాలన్నది లోకేష్ ఉద్దేశంగా ఉందని ఎద్దేవా చేశరు. కేంద్ర ప్రభుత్వ తప్పులను రాష్ట్ర తప్పులుగా చిత్రీకరించే పనిలో ఎల్లో ఛానల్స్ ఉన్నాయని ఆద్రహం వ్యక్తం చేశారు. అయితే వాటిని నమ్మే పరిస్థితి రాష్ట్రంలో లేదని స్పష్టం చేశారు.

చదవండి: ఏపీ: గత 24 గంటల్లో 6,141 కరోనా కేసులు

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు