‘అమరరాజాది రాజకీయ సమస్య కాదు.. పొల్యూషన్ సమస్య’

6 Aug, 2021 12:44 IST|Sakshi

అమరరాజా వ్యవహారంలో టీడీపీ రాద్ధాతం విడ్డూరం

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజా

సాక్షి, చిత్తూరు: అమర రాజాది రాజకీయ సమస్య కాదు.. పొల్యూషన్ సమస్య అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, అమర రాజా ఫ్యాక్టరీ వ్యవహారంలో టీడీపీ రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. అమరరాజాతో పాటు 54 ఫ్యాక్టరీలకు నోటీసులు ఇచ్చారన్నారు. గతంలో విశాఖ ఎల్‌జీ పాలిమర్స్ ఘటనపై చంద్రబాబు గగ్గోలు పెట్టారని.. ప్రాణాలతో ఆడుకుంటున్న అమర్‌రాజా ఫ్యాక్టరీపై ఎందుకు మాట్లాడటం లేదని ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు