‘చంద్రబాబు దొంగల ముఠా నాయకుడు’

18 Jun, 2021 14:30 IST|Sakshi

చంద్రబాబు ఏపీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు 

సాక్షి, అమరావతి: లోకేష్‌ వ్యవహార శైలిపై చంద్రబాబు సిగ్గుపడాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు మండిపడ్డారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు ఏపీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. నారా లోకేష్‌ దిగజారి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్సీ పదవి పోబోతోందని లోకేష్‌ తీవ్ర నిరాశతో ఉన్నారన్నారు. శరీరం సైజు తగ్గినా లోకేష్‌ బుద్ధి మాత్రం మారలేదన్నారు.

‘‘హత్యా రాజకీయాలను ప్రోత్సహించిన మీకు మాట్లాడే అర్హత లేదు. రంగా హత్య నుంచి ఇప్పటివరకు హత్యారాజకీయాలు చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు దొంగల ముఠా నాయకుడు. విఫల నేతలుగా మారిన మీరు జోకర్లుగా మిగిలిపోతారంటూ సుధాకర్‌ బాబు దుయ్యబట్టారు. ఢిల్లీ వెళ్లినప్పుడల్లా ప్రత్యేక హోదా అడుగుతూనే ఉన్నామని ఆయన అన్నారు.

చదవండి: ఏపీ: జాబ్‌ క్యాలెండర్ విడుదల చేసిన సీఎం జగన్
ఏపీ: కర్ఫ్యూ వేళల సడలింపు 

మరిన్ని వార్తలు