'ఏజీ వెనక చంద్రబాబు, టీడీపీ నాయకులున్నారు'

15 Sep, 2020 16:24 IST|Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి: అవినీతికి, అక్రమాలకు చంద్రబాబు పెట్టింది పేరని, తన పాలనలో రెండు లక్షల కోట్లు దోచుకున్నాడంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ ఫైర్‌ అయ్యారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'అమరావతి భూ కుంభకోణానికి పాల్పడిన వారందరిని కఠినంగా శిక్షించాలి. అమరావతిని రాజధానిగా ప్రకటించకముందే ఏపీ మాజీ అడ్వకేట్‌ జనరల్‌ నాలుగు వందల ఎకరాల భూములను ఇన్‌సైడ్‌ ట్రేడింగ్ ద్వారా అధిక లాభాలు పొందాడు అంటే ఏజీ వెనుక చంద్రబాబు, తెలుగుదేశం నాయకులు ఉన్నారు. 

అమరావతి భూములను దళిత, పేద రైతుల నుంచి బలవంతంగా తీసుకొని భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. చంద్రబాబు బావమరిది బాలకృష్ణకు అమరావతిలో వేలాది ఎకరాలు తక్కువ ధరకే కేటాయించడం వెనక చంద్రబాబు, లోకేష్ ఉన్నారు. అవినీతి, అక్రమాలు, వెన్నుపోట్లుకు చంద్రబాబు పెట్టింది పేరు. అందుకునే రెండు ఎకరాల ఆసామి లక్షల కోట్లకు అధిపతి అయ్యాడు. ఎన్నికల్లో పోటీ చేసి గెలవలేని అసమర్ధుడు నారా లోకేష్ దొడ్డిదారిన శాసనమండలికి వెళ్లి, ప్రతి అవినీతి వెనక ఉండి కోట్లు సంపాదించి రాజకీయాలను భ్రష్టు పట్టించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన వికేంద్రీకరణ ద్వారా మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలని చూస్తున్నారు. కానీ అవినీతిపరుడైన చంద్రబాబు కోర్టుల ద్వారా అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు అని గ్రంధి శ్రీనివాస్‌ తెలిపారు.  ('అమరావతి కుంభకోణం దేశంలోనే అతిపెద్దది')

వారిని కఠినంగా శిక్షించాలి: వీఆర్‌ ఎలీజా
అమరావతి భూ కుంభకోణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి. అమరావతిని రాజధానిగా ప్రకటించకముందే 4వేల పైచిలుకు భూములను తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు కొనుగోలు చేశారు. ఈ భుముల ద్వారా లాభాలు పొందాలనే దురుద్దేశంతోనే టీడీపీ నాయకులు బినామీల పేర్లతో కొన్నారు. అమరావతి పేరిట 900 ఎకరాల భూములను దళిత, పేద రైతుల నుంచి బలవంతంగా తీసుకొన్నారు. 900 ఎకరాలు తీసుకున్న తర్వాత నోటిఫికేషన్‌ ఇవ్వడం చాలా దారుణమన్నారు. భూకుంభకోణానికి పాల్పడిన ఎంతటి వారినైనా చట్టపరంగా శిక్షించాలని ఎమ్మెల్యే ఎలీజా కోరారు. (కేసులతో చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి)

భూకుంభకోణంపై ఏసీబీ కేసు హర్షించదగిన విషయం: కొట్టు సత్యనారాయణ
అమరావతి ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌పై ఏసీబీ కేసు నమోదు చేయడం హర్షించదగిన విషయమని తాడేపల్లిగూడెం​శాసనసభ్యులు కొట్టు సత్యనారాయణ అన్నారు. 'అమరావతిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి చెప్తూనే ఉంది. రాజధాని పేరుమీద వేలకోట్లు తెలుగుదేశం నాయకులు దోపిడీ చేశారు. పూలింగ్ వ్యవస్థను  తెలుగుదేశం నేతలు అపహాస్యం చేశారు. 900 ఎకరాల అసైన్డ్ భూములు దళితుల నుంచి బలవంతంగా కొనుగోలు చేసిన దుర్మార్గులు చంద్రబాబు అండ్ కో. సీఆర్డీఏ పరిధిని ఇష్టమొచ్చినట్లు మార్చేసి రాజధాని ప్రకటనకు ముందే 4,075 ఎకరాలు టీడీపీ నాయకులు కొనుగోలు చేశారు. కచ్చితంగా రాజధాని భూముల్లో చేసిన అక్రమాలు బయటపడతాయి. ఖచ్చితంగా అక్రమాలు చేసిన ప్రతిఒక్కరూ జైలుకి వెళ్లడం ఖాయం' అని సత్యనారాయణ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు