‘చంద్రబాబు మూడు గంటల బ్రేక్ ఫాస్ట్ దీక్ష చేశారు’

30 Jun, 2021 12:50 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మూడు గంటల బ్రేక్ ఫాస్ట్ దీక్ష చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ సీ. రామచంద్రయ్య విమర్శించారు. సంక్షేమం అనేది చంద్రబాబు డిక్షనరీలోనే లేదని దుయ్యబట్టారు. అధికార పార్టీపై బురద జల్లడమే చంద్రబాబు లక్ష్యమని మండిపడ్డారు. ప్రభుత్వంపై ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తోందని నిప్పులు  చేరిగారు. చంద్రబాబు గాలి మాటలు చెబుతూ జూమ్‌లో కాలక్షేపం చేస్తున్నారని, మోదీని విమర్శించాలంటే చంద్రబాబుకు భయమని ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు