‘అమర్‌రాజ ఫ్యాక్టరీ అమెరికాలో ఉంటే.. 25 ఏళ్ల జైలు శిక్ష పడేది’

7 Aug, 2021 17:06 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

అనంతపురం: అమర్‌రాజ ఫ్యాక్టరీపై ఎల్లోమీడియా వక్రభాష్యం చెబుతోంది అంటూ ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌ మండిపడ్డారు. అమర్‌రాజ ఫ్యాక్టరీ అమెరికాలో ఉండి ఉంటే వారు చేసిన కాలుష్యానికి.. 25 ఏళ్ల జైలు శిక్ష, భారీ జరిమానాలు వేసేవారు అని తెలిపారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది చంద్రబాబే అని మహ్మద్‌ ఇక్బాల్ ఆరోపించారు. 

పేద ప్రజల వ్యతిరేకి చంద్రబాబు
విజయవాడ:
పేద ప్రజల వ్యతిరేకి చంద్రబాబు.. రాష్ట్రంలో టీడీపీ భూస్థాపితం, బీజేపీకి క్యాడర్ లేదన్నారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. పులిచింతల ప్రాజెక్ట్ పనులను చంద్రబాబు అడ్డుకున్నారని ఆరోపించారు. పేదల ఇళ్లపైనా చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని మండి పడ్డారు. రాష్ట్రంలో పేద ప్రజలకు సీఎం జగన్ అండగా నిలిచారని మల్లాది విష్ణు తెలిపారు. 

మరిన్ని వార్తలు