లోకేష్ ప్రవర్తన జుగుప్సాకరంగా ఉంది: ఎమ్మెల్సీ ఇక్బాల్

18 Aug, 2021 15:25 IST|Sakshi

అనంతపురం: లోకేష్ ప్రవర్తన జుగుప్సాకరంగా ఉందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఇక్బాల్ ధ్వజమెత్తారు. విద్యార్థిని రమ్య హత్య దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రమ్య మృతదేహాన్ని తరలించే అంబులెన్స్‌ను అడ్డుకోవడం దారుణమని, టీడీపీ శవ రాజీకాయాలు మానుకోవాలని హితవు పలికారు. పోలీసులపై దాడి సరికాదని, టీడీపీ ఎల్లోమీడియా వక్రభాష్యం మానుకోవాలని మండిపడ్డారు. లోకేష్‌కు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ చిన్నాన్న రామూర్తిని ఎందుకు పరామర్శించలేదని సూటిగా ప్రశ్నించారు. యాసిడ్ బాధితురాలికి కోర్టు ఆదేశించినా చంద్రబాబు రూ.5 లక్షల పరిహారం ఇవ్వలేదని గుర్తు చేశారు. శాంతిభద్రతల సమస్య సృష్టించేందుకే టీడీపీ కుట్ర చేస్తోందన్నారు

మరిన్ని వార్తలు