నారా లోకేశ్‌కు ఎమ్మెల్సీ తలశిల రఘురాం కౌంటర్‌

25 Jan, 2023 16:45 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్‌పై ఎమ్మెల్సీ తలశిల రఘురాం ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నీతిమాలిన రాజకీయాలు చేస్తోంది. రాజకీయాల కోసం తప్ప ప్రజల కోసం పాదయాత్ర చేస్తే మంచిది అంటూ కామెంట్స్‌ చేశారు. 

కాగా, ఎమ్మెల్సీ రఘురాం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారమే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాదయాత్ర చేశారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని యాత్ర చేశారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను సీఎం వైఎస్‌ జగన్‌ నెరవేర్చారు. నారా లోకేశ్‌ పాదయాత్రకు కూడా అవే నిబంధనలు అమలవుతాయి. లోకేశ్‌ పాదయాత్రకు అనుమతులు ఇవ్వలేదంటూ కొన్ని పత్రికలు రాతలు రాస్తున్నాయి. అవన్నీ అవాస్తవాలు. 

ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నాము. కానీ, లోకేష్ మొదటి అడుగు పడకముందే కుట్రలు చేస్తున్నారు. రాజకీయాల కోసం తప్ప ప్రజల కోసం పాదయాత్ర చేస్తే మంచిది. అమరావతి రైతుల పేరుతో చేసిన యాత్ర కూడా మధ్యలోనే ఆగిపోయింది. నిజమైన‌ లక్ష్యంతో యాత్రలు చేస్తేనే సక్సెస్ అవుతాయి. ప్రగల్భాల మాటలను టీడీపీ లీడర్లు మానుకోవాలి. సెక్యూరిటీ సమస్యలు రాకూడదనే మేము వివరాలు అడుగుతున్నాం. శాంతియుతంగా పాదయాత్ర చేస్తే అందరూ హర్షిస్తారు.  లోకేష్, పవన్‌ కల్యాణ్‌తోపాటు ఇంకెవరైనా ఉంటే వారితో కూడా పాదయాత్ర చేయించుకోవచ్చు అని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. 

మరిన్ని వార్తలు :

Advertisement
మరిన్ని వార్తలు